మధ్యవర్తిత్వంతో వివాదాల పరిష్కారం: జొన్నవాడలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహణ

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: నెల్లూరు

మధ్యవర్తిత్వంతో వివాదాలు గోప్యంగా, ప్రచార ఆర్భాటాలు లేకుండా సులభంగా పరిష్కారమవుతాయని జడ్జి వై.జె. పద్మశ్రీ పేర్కొన్నారు. బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని జొన్నవాడలో మంగళవారం నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సులో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఇరు పక్షాల సౌలభ్యం మేరకు విచారణ సమయం, ప్రదేశం నిర్ణయించుకోవచ్చని స్పష్టం చేశారు. కుటుంబ, వాణిజ్య వివాదాల్లో సంబంధాలను కాపాడుకునేందుకు ఇది ఎంతగానో ఉపకరిస్తుందని తెలిపారు. తక్కువ ఆదాయం ఉన్నవారికి ఉచిత న్యాయ సహాయం అందిస్తామని ఆమె వెల్లడించారు.