శ్రీసత్యసాయి జిల్లాలో పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు

రిపోర్టర్: కిరణ్ స్థలం: శ్రీసత్యసాయి జిల్లా

శ్రీసత్యసాయి జిల్లా గుడిబండ మండలం కడుపులయపాళ్యం గ్రామ సమీపంలో ఏపీఎస్‌ఆర్టీసీ బస్సు అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది. ప్రమాద సమయంలో బస్సులో సుమారు వంద మందికి పైగా విద్యార్థులు ప్రయాణిస్తున్నారు. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పెను ప్రమాదం తప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.