ఢిల్లీలో అట్టహాసంగా ప్రారంభమైన ప్రపంచ అతిపెద్ద వన్వివాహ్ ప్రదర్శన

రిపోర్టర్: మహేష్ స్థలం: ఢిల్లీ

దేశ రాజధాని ఢిల్లీలో ప్రతిష్టాత్మకంగా ప్రారంభమైన ప్రపంచ అతిపెద్ద వెడ్డింగ్ ఎక్స్పో వన్వివాహ్ వివాహ రంగంలో విప్లవాత్మక మార్పులకు వేదికైంది. 150కి పైగా ఎగ్జిబిటర్లు, ప్రముఖ బ్రాండ్లు భాగస్వామ్యమైన ఈ ప్రదర్శనలో ఫ్యాషన్, జ్యువెల్లరీ, డెకర్, ఆతిథ్య రంగాల అద్భుత సమ్మేళనం కొనుగోలుదారులను ఆకట్టుకుంటోంది. దేశీయ వివాహ ఆర్థిక వ్యవస్థ ఏటా కోట్లాది రూపాయల వ్యాపారంతో సరికొత్త రికార్డులు సృష్టిస్తోందని, డెస్టినేషన్ వెడ్డింగ్ల ట్రెండ్ వేగంగా పెరుగుతోందని నిర్వాహకులు తెలిపారు.