శ్రీశైలంలో అట్టహాసంగా ఆరుద్రోత్సవం: స్వర్ణ రథంలో విహరించిన మల్లన్న

రిపోర్టర్: సురేష్ స్థలం: శ్రీశైలం

శ్రీశైల క్షేత్రంలో ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని శనివారం నాడు శ్రీస్వామి అమ్మవార్ల స్వర్ణరథోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించినట్లు ఆలయ అధికారులు తెలిపారు. వేకువజామునే రుద్రాభిషేకం, అన్నాభిషేకం వంటి ప్రత్యేక పూజలు ఘనంగా జరిపినట్లు వెల్లడించారు. అనంతరం దేశం శాంతి సౌభాగ్యాలతో తులతూగాలని ప్రత్యేక సంకల్పంతో గంగాధర మండపం నుండి నందిమండపం వరకు స్వర్ణరథోత్సవం కనులవిందుగా సాగిందని, భక్తులు శివనామస్మరణతో పులకించారని పేర్కొన్నారు.