ఓటర్ల జాబితా ట్యాంపరింగ్పై సీఈసీపై ప్రియాంక గాంధీ తీవ్ర ఆగ్రహం

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: న్యూఢిల్లీ

ఓటర్ల జాబితా సవరణలో అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్పై క్రిమినల్ కేసులు నమోదు చేసి విచారణ చేపట్టాలని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ డిమాండ్ చేశారు. కేరళలోని వాయనాడ్లో మీడియాతో మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య వ్యవస్థను అపహాస్యం చేసేలా వ్యవహరిస్తూ కోట్లాది మంది ఓటర్ల పేర్లను తొలగించడం దేశద్రోహంతో సమానమని ఆమె మండిపడ్డారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని ఆమె డిమాండ్ చేశారు.