ఐబొమ్మ నిర్వాహకుడు రవి బ్యాంకు ఖాతాలకు నాంపల్లి కోర్టు అనుమతి
రిపోర్టర్: వెంకట్
స్థలం: హైదరాబాద్
సంచలనం సృష్టించిన ఐబొమ్మ నిర్వాహకుడు రవికి నాంపల్లి కోర్టులో కొంత ఊరట లభించింది. దర్యాప్తులో భాగంగా పోలీసులు సీజ్ చేసిన బ్యాంకు ఖాతాలను తిరిగి లావాదేవీల నిమిత్తం ఉపయోగించుకునే వెసులుబాటు కల్పిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఖాతాలు వాడుకునేందుకు అనుమతినిచ్చినప్పటికీ, అందులో ఉన్న సుమారు రూ.3 కోట్ల నగదును అన్‌ఫ్రీజ్ చేసేందుకు, విత్‌డ్రా చేసుకునేందుకు మాత్రం న్యాయస్థానం నిరాకరించింది. భవిష్యత్ లావాదేవీలకు మాత్రమే ఈ వెసులుబాటు వర్తిస్తుంది.