తుఫాను హెచ్చరికల వేళ బొబ్బిలిలో క్షేత్రస్థాయి పరిశీలన
రిపోర్టర్: GANESH BBL
స్థలం: బొబ్బిలి
విజయనగరం జిల్లా బొబ్బిలి పట్టణంలో తుఫాను ప్రభావం నేపథ్యంలో పురపాలక కమిషనర్ శ్రీమతి ఎల్. రామలక్ష్మి గురువారం నాడు అధికారులతో కలిసి జలమయమయ్యే ప్రాంతాల్లో పర్యటించారు. మల్లమ్మ పేట, నాయుడు కాలనీ, అప్పయ్యపేట తదితర ప్రాంతాలను పరిశీలించి ఇంజనీరింగ్, శానిటేషన్ సిబ్బందిని అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, కాల్ సెంటర్ను సంప్రదించాలని సూచించారు.