సాయిదుర్గా తేజ్ కొత్త సినిమా: అడవి నేపథ్యంలో భారీ యాక్షన్ డ్రామా

రిపోర్టర్: కిరణ్ స్థలం: హైదరాబాద్

మెగా సుప్రీం హీరో సాయిదుర్గా తేజ్ వరుసగా విభిన్న కథాంశాలను ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. దర్శకుడు తేజ కాకుమాను తెరకెక్కించనున్న ఈ కొత్త సినిమాను నిర్మాత అనిల్ సుంకర నిర్మించనున్నారు. అటవీ నేపథ్యంలో సాగే యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం రూపొందనుందని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రంలో అడవి నేపథ్యంలో సాగే సన్నివేశాలు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయని సినీ విశ్లేషకులు తెలిపారు.