బహదూర్ గూడ రైతుల భూముల కోసం బీఆర్ఎస్ పోరాటం

రిపోర్టర్: కిరణ్ స్థలం: తెలంగాణ

బహదూర్ గూడలో బుల్లెట్ ట్రైన్ భూసేకరణ పేరుతో రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ దందాలు చేస్తున్నారని బీఆర్ఎస్ నాయకుడు పట్లోళ్ల కార్తీక్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. భూములు కోల్పోతున్న రైతుల పక్షాన నిలబడి ప్రశ్నిస్తున్న తమపై బట్టకాల్చి మీద వేస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. సీఎం రేవంత్ రెడ్డి ఎన్ని జిమ్మిక్కులు చేసినా బహదూర్ గూడ రైతుల పక్షాన ఎల్లప్పుడూ నిలబడతామని స్పష్టం చేశారు.