ఫంక్షన్‌కు వెళ్లాలంటే జయాకు అలా అబద్ధం చెబుతా: అమితాబ్ బచ్చన్

రిపోర్టర్: మహేష్ స్థలం: Mumbai

కౌన్ బనేగా కరోడ్‌పతి షోలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తన భార్య జయా బచ్చన్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. పెళ్లిళ్లు లేదా ఫంక్షన్‌లకు వెళ్లేటప్పుడు జయా ఆలస్యంగా తయారవుతారని, అందుకే తాను ఒక గంట ముందుగానే వేడుక సమయం చెబుతానని సరదాగా వెల్లడించారు. అప్పుడే ఆమె త్వరగా సిద్ధమవుతారని, తాము సమయానికి వేడుకకు చేరుకోగలుగుతామని అమితాబ్ నవ్వుతూ వివరించారు.