మడ్డువలస జలాశయంలోకి భారీగా వచ్చి చేరుతున్న వరద నీరు

రిపోర్టర్: రమేష్ స్థలం: విజయనగరం

విజయనగరం జిల్లా వంగర మండలం మడ్డువలస జలాశయంలోకి వేగావతి, సువర్ణముఖీ నదుల ద్వారా 3250 క్యూసెక్కుల భారీ వరద నీరు వచ్చి చేరుతోంది. జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 65 మీటర్లు కాగా, ప్రస్తుతం నీటిమట్టం 63.36 మీటర్లకు చేరింది. బుధవారం సాయంత్రానికి నీటి మట్టం మరింత పెరిగే అవకాశం ఉందని జలాశయం డీఈ అర్జున్ వెల్లడించారు.