మున్సిపల్ ఎన్నికల వేళ హైఅలర్ట్: అనిల్ చంద్ర పునేఠా కీలక ఆదేశాలు
రిపోర్టర్: హరి
స్థలం: తెలంగాణ
రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణ ప్రక్రియ వేగవంతమైన నేపథ్యంలో ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని పోలీస్ విభాగాన్ని ఆయన ఆదేశించారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో వెబ్ కాస్టింగ్ సౌకర్యం ఏర్పాటు చేయాలని, నిష్పాక్షికంగా ఎన్నికలు పూర్తి చేయాలని అనిల్ చంద్ర పునేఠా స్పష్టం చేశారు.