రోహిత్ విరాట్ కోహ్లీ నిరూపించాల్సింది ఏమీ లేదన్న ఆకాశ్ చోప్రా
రిపోర్టర్: రమేష్
స్థలం: న్యూఢిల్లీ
భారత స్టార్ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇకపై కొత్తగా నిరూపించాల్సింది ఏమీ లేదని, వారు కేవలం పరుగులు సాధిస్తూ వెళ్లాలని మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డారు. 2027 వన్డే ప్రపంచకప్ దృష్ట్యా వెస్టిండీస్‌తో జరగనున్న పరిమిత ఓవర్ల సిరీస్‌కు ఎంపికైన ఈ అనుభవజ్ఞుల జోడీపై భారీ అంచనాలు ఉన్నాయని, యువ ఆటగాళ్లతో పాటు వీరి ప్రదర్శన కూడా జట్టు విజయాల్లో కీలకమని ఆయన పేర్కొన్నారు.