కారులో ఊపిరాడక నాలుగేళ్ల చిన్నారి మృత్యువాత
రిపోర్టర్: కిరణ్
స్థలం: భద్రాద్రి కొత్తగూడెం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం వినోబానగర్లో కారులో ఊపిరాడక నాలుగేళ్ల చిన్నారి మృతి చెందిన విషాద ఘటన చోటుచేసుకుంది. సర్పంచి గంగావత్ నవీన్ కుమార్తె తన్విశ్రీ ఆడుకుంటూ కారు ఎక్కి డోర్ వేయడంతో లోపల లాక్ పడిపోయింది. దాదాపు రెండు గంటల తర్వాత గుర్తించి అద్దాలు పగలగొట్టి ఆసుపత్రికి తరలించగా, అప్పటికే పాప మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.