సూర్యాపేటలో మతసామరస్యం: విజయదశమి వేడుకల్లో ముస్లిం, క్రైస్తవ సోదరులతో ఆత్మీయ విందు

రిపోర్టర్: శివ స్థలం: Suryapet

విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని సూర్యాపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ముస్లిం, క్రైస్తవ సోదరులకు సామూహిక విందు ఏర్పాటు చేసినట్లు మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి తెలిపారు. సూర్యాపేటలో ప్రజల మధ్య ఉన్న మతసామరస్యం, ఐక్యత ప్రశంసనీయమని ఆయన పేర్కొన్నారు. సర్వమతాల సారాంశం మానవత్వమేనని, భారతీయ సంస్కృతి దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు.