అసెంబ్లీలో పోలీసుల తీరుపై గవర్నర్‌కు బీఆర్‌ఎస్ ఫిర్యాదు
రిపోర్టర్: శివ
స్థలం: తెలంగాణ
అసెంబ్లీ వెలుపల మహిళా ఎమ్మెల్యేల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో నేతలు గవర్నర్ శివప్రతాప్ శుక్లాను కలిశారు. సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిలపై దాడి ఘటనల వీడియోలను గవర్నర్‌కు చూపించారు. అసెంబ్లీ బయట చోటుచేసుకున్న ఘటనలపై డీజీపీని పిలిపించి మాట్లాడి చర్యలు తీసుకుంటామని గవర్నర్ హామీ ఇచ్చినట్లు కేటీఆర్ తెలిపారు.