నెల్లూరులో భారీ వర్షాల నేపథ్యంలో డ్రైనేజీలను పరిశీలించిన మున్సిపల్ కమిషనర్

రిపోర్టర్: గోపి స్థలం: నెల్లూరు

నెల్లూరు నగరంలో కురిసిన భారీ వర్షాలకు రోడ్లపై చేరిన వరద నీటి తొలగింపు చర్యలను నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ నందన్ ఆదివారం అధికారులతో కలిసి పరిశీలించారు. మద్రాస్ బస్టాండ్, ఎస్ 2 సినిమా హాల్ కూడలి, కర్ణాల మిట్ట ప్రాంతాల్లో పర్యటించి మురుగు కాలువలు, డ్రైనేజీలను పరిశీలించారు. వర్షపు నీరు సాఫీగా ప్రవహించేలా యుద్ధ ప్రాతిపదికన పూడికతీత పనులు చేపట్టాలని అధికారులను ఆయన ఆదేశించారు.