లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే

రిపోర్టర్: Abdul Azeem స్థలం: ఆమనగల్

కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు హైదరాబాద్లోని తన నివాసంలో పలువురు లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి చెక్కులు, ఎల్ఓసీ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ సకాలంలో అందేలా అధికారులు, నాయకులు సమన్వయంతో కృషి చేయాలని సూచించారు. ప్రజల ఆరోగ్య సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఆపదలో ఉన్న వారికి అండగా ఉండటమే తమ ప్రాధాన్యత అని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.