ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకాల జోరు: భారత క్రీడాకారులకు నేతల అభినందనలు
రిపోర్టర్: మహేష్
స్థలం: అమరావతి
ఆసియా క్రీడల్లో అద్భుత ప్రతిభ కనబరిచి స్వర్ణ పతకాలు సాధించిన భారత ఆర్చర్లు, అథ్లెట్లకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. కుషాల్ దలాల్, సాహిల్ జాదవ్, గణేశ్ మణిరత్నం తిరుమూరు చూపిన సంయమనం అసాధారణమని ఆయన పేర్కొన్నారు. ఏపీకి చెందిన గణేశ్ మణిరత్నం విజయం రాష్ట్రానికి గర్వకారణమని కొనియాడారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ కూడా క్రీడాకారులను అభినందించారు.