ట్రాఫిక్ భవిష్యత్ మెరుగుదల కోసం సైబరాబాద్ మూవ్స్ 2026 సదస్సు
రిపోర్టర్: కృష్ణ
స్థలం: మేడ్చల్ మల్కాజిగిరి
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని టీ-హబ్ వేదికగా నవంబర్ 26 నుంచి 28 వరకు సైబరాబాద్ మూవ్స్ 2026 సదస్సు నిర్వహించనున్నట్లు సైబరాబాద్ పోలీస్ శాఖ వెల్లడించింది. సురక్షితమైన మరియు స్థిరమైన రవాణా పరిష్కారాలపై ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా చర్చిస్తామని పేర్కొన్నారు. నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలకు వినూత్న మార్గాలు అన్వేషించడమే ఈ సదస్సు ప్రధాన ఉద్దేశమని, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ సదస్సును విజయవంతం చేయాలని వారు కోరారు.