భారీ ఊరట: ఢిల్లీ వేదికగా భారత్ శ్రీలంక తొలి వన్డే

రిపోర్టర్: శివ స్థలం: ఢిల్లీ

భారత్ శ్రీలంక జట్ల మధ్య డిసెంబర్ పదమూడున జరగాల్సిన తొలి వన్డే మ్యాచ్ వేదిక మారడం లేదని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా స్పష్టం చేశారు. అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతున్న నిర్మాణ పనుల కారణంగా మ్యాచ్ అహ్మదాబాద్కు మారుతుందంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఆయన తెలిపారు. ద్వైపాక్షిక సిరీస్ మ్యాచ్ల కేటాయింపు బోర్డు నిబంధనల ప్రకారమే జరుగుతుందని ఆయన సోమవారం అధికారికంగా వెల్లడించారు.