అసెంబ్లీ ఘటనపై జాతీయ మహిళా కమిషన్‌కు సబితా ఇంద్రారెడ్డి ఫిర్యాదు

రిపోర్టర్: మహేష్ స్థలం: న్యూఢిల్లీ

తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో మహిళా ప్రజాప్రతినిధులపై జరిగిన దాడిపై బీఆర్‌ఎస్ నేత సబితా ఇంద్రారెడ్డి నేతృత్వంలో బృందం ఢిల్లీలో జాతీయ మహిళా కమిషన్‌ను ఆశ్రయించింది. పోలీసులు తమ పట్ల అమానుషంగా వ్యవహరించి, చీరలు లాగుతూ దౌర్జన్యం చేశారని ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య దేవాలయంలో మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.