రహీంఖాన్‌పేట స్టేజీ వద్ద బస్సులు నిలిపేలా చర్యలు
రిపోర్టర్: Raju Reporter
స్థలం: ఆత్మకూర్
రహీంఖాన్‌పేట స్టేజీ వద్ద, బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రి వద్ద బస్సులు నిలిపేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ సీపీఐ ఆత్మకూర్ మండల సమితి ఆధ్వర్యంలో డిపో మేనేజర్‌కు వినతిపత్రం అందజేశారు. దీనిపై స్పందించిన డిపో మేనేజర్ రహీంఖాన్‌పేట స్టేజీని ఎస్సార్‌లో నమోదు చేస్తున్నట్లు తెలిపారు. తద్వారా ఇకపై ఆ ప్రాంతంలో బస్సులు నిలిచేలా చూస్తామని ఆయన హామీ ఇవ్వడంతో నాయకులు హర్షం వ్యక్తం చేశారు.