జహీరాబాద్లో వినాయక నిమజ్జన భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ పరితోష్ పంకజ్
రిపోర్టర్: వెంకట్
స్థలం: సంగారెడ్డి
జహీరాబాద్ నారింజ బ్రిడ్జ్ వద్ద వినాయక నిమజ్జన భద్రతా ఏర్పాట్లను జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ పరిశీలించారని ఎస్పీ సంగారెడ్డి పేర్కొన్నారు. శోభాయాత్రలు, నిమజ్జనాలను ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల సమన్వయంతో బారికేడింగ్, లైఫ్ జాకెట్లు, గజ ఈతగాళ్లు, తగిన లైటింగ్ వంటి పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలందరూ ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావివ్వకుండా పోలీసులకు సహకరించి పండుగను ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా జరుపుకోవాలని ఎస్పీ సూచించినట్లు ఎస్పీ సంగారెడ్డి వెల్లడించారు.