ధర్మ పరిరక్షణ కోసం అశోక్ సింఘాల్ సేవలు చిరస్మరణీయం: వెంకయ్య నాయుడు

రిపోర్టర్: Alfa News Desk స్థలం: గోల్కొండ

హైదరాబాద్లో విశ్వహిందూ పరిషత్ నిర్వహించిన అశోక్ సింఘాల్ జన్మ శతాబ్ది సమ్మేళనంలో మాజీ ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు పాల్గొన్నారు. ధర్మ పరిరక్షణ, సామాజిక సామరస్యం కోసం ఆయన చేసిన సేవలను కొనియాడారు. అయోధ్య రామమందిర నిర్మాణానికి ఆయన చేసిన కృషి ఎప్పటికీ నిలిచిపోతుందన్నారు. ఆశయాల బాటలో నడవాలని పిలుపునిచ్చారు.