అమెరికాలో ఘనంగా తానా అడాప్ట్ హైవే సేవా కార్యక్రమం

రిపోర్టర్: గోపి స్థలం: అమెరికా

అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రం మెకానిక్స్ బర్గ్ లో తానా మిడ్ అట్లాంటిక్ విభాగం ఆధ్వర్యంలో అడాప్ట్ హైవే కార్యక్రమం అత్యంత ఘనంగా నిర్వహించారు. వరుసగా మూడవ ఏడాది కూడా చేపట్టిన ఈ రోడ్ల శుభ్రత కార్యక్రమంలో నూటికి పైగా వలంటీర్లు ఉత్సాహంగా పాల్గొన్నారు. తానా అధ్యక్షుడు డాక్టర్ నరేన్ కొడాలి, ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ లావు తదితర ప్రముఖుల నేతృత్వంలో నిర్వహించిన ఈ సేవ కార్యక్రమం ద్వారా స్థానిక అమెరికా ప్రజలకు కూడా సహాయం అందించడం విశేషం.