ఢిల్లీ విమానాశ్రయంలో అభిజీత్ డిప్కే అరెస్ట్: అమ్మమ్మ మృతితో కుటుంబంలో తీవ్ర విషాదం
రిపోర్టర్: శివ
స్థలం: ఢిల్లీ
కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ డిప్కే అమ్మమ్మ శనివారం అనారోగ్యంతో కన్నుమూశారని కుటుంబ సభ్యులు తెలిపారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీనామా కోరుతూ నిరసనలో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లిన అభిజీత్‌ను విమానాశ్రయంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అమ్మమ్మ మరణ వార్త తెలియడంతో ఆయన కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ క్లిష్ట సమయంలో అభిజీత్‌ను విడుదల చేయాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.