సీఎం సన్నిహితుడి వేధింపులపై మహిళా ఎంటర్‌ప్రెన్యూర్ శోభా రెడ్డి సంచలన ఆరోపణలు
రిపోర్టర్: కృష్ణ
స్థలం: తెలంగాణ
అడ్వర్టైజింగ్ రంగంలో న్యాయబద్ధంగా అవకాశం కోరిన కె.శోభా రెడ్డి అనే మహిళా ఎంటర్‌ప్రెన్యూర్‌కు సీఎం సన్నిహితుడి నుంచి తీవ్ర వేధింపులు ఎదురయ్యాయి. సాయం కోసం గెస్ట్ హౌస్‌కు రావాలని, కారులో తనను ఆనందపరచాలని సదరు వ్యక్తి లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆమె ఎక్స్ వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. వీధుల్లో ముష్టి ఎత్తుకుంటాను కానీ ఇలాంటి తప్పుడు పనులు చేయనని స్పష్టం చేస్తూ, దీనిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.