మిత్రధర్మాన్ని విస్మరించి కాంగ్రెస్ ఏకపక్షంగా వ్యవహరించడంపై కూనంనేని మండిపాటు
రిపోర్టర్: భాస్కర్
స్థలం: హైదరాబాద్
తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ తీరుపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి సంప్రదింపులు జరపకుండా ఏకపక్షంగా అభ్యర్థులను ప్రకటించడం సరైన పద్ధతి కాదని ఆయన స్పష్టం చేశారు. మిత్రధర్మాన్ని విస్మరించిన కాంగ్రెస్ నిర్ణయంపై త్వరలోనే వామపక్ష భాగస్వామ్య పార్టీలతో అత్యవసరంగా చర్చించి భవిష్యత్ కార్యాచరణను ఖరారు చేస్తామని కూనంనేని సాంబశివరావు వెల్లడించారు.