చీపురుపల్లిలో వైసీపీకి భారీ షాక్ ఇస్తూ నేతల రాజీనామా

రిపోర్టర్: కిరణ్ స్థలం: Vizianagaram

వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ సొంత నియోజకవర్గమైన చీపురుపల్లిలో ఆ పార్టీకి భారీ షాక్ తగిలింది. మెరకముడిదాం మండలంలో వైసీపీ మండల అధ్యక్షుడు కోట్ల వెంకట్రావుతో పాటు 13 గ్రామాలకు చెందిన మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు సామూహికంగా రాజీనామా చేశారు. తమ రాజీనామా పత్రాలను పార్టీ అధ్యక్షుడు జగన్కు పంపామని, త్వరలోనే తెలుగుదేశం పార్టీలో చేరతామని వారు స్పష్టం చేసినట్లు మెరకముడిదాం నాయకులు తెలిపారు.