ఈ నెల 9న థియేటర్లలోకి మయూఖ చిత్రం రానుందని శ్రీతేజ వెల్లడి
రిపోర్టర్: భాస్కర్
స్థలం: హైదరాబాద్
మిస్టరీ థ్రిల్లర్ కథాంశంతో రూపొందించిన మయూఖ చిత్రం ఈ నెల 9న ప్రేక్షకుల ముందుకు రానుందని దర్శకుడు శ్రీతేజ ఎస్.కె వెల్లడించారు. పాయల్ చెంగప్ప ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు ఇటీవల జరిగిన న్యూయార్క్ ఫిల్మ్ ఫెస్టివల్లో బెస్ట్ మిస్టరీ ఫిల్మ్ అవార్డు దక్కిందని ఆయన తెలిపారు. ప్రేక్షకులకు ఎమోషనల్గా కనెక్ట్ అవుతూ గొప్ప థియేట్రికల్ అనుభూతిని ఇస్తుందని చెప్పారు.