జక్కంపూడి టిడ్కో ఇళ్ల నిర్మాణ పనులు వేగవంతం
రిపోర్టర్: సతీష్
స్థలం: ఎన్టీఆర్ జిల్లా
విజయవాడ శివారు జక్కంపూడి వద్ద తెదేపా హయాంలో నిర్మించిన టిడ్కో ఇళ్ల పనులను కూటమి ప్రభుత్వం వేగవంతం చేసింది. గత వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యంతో శిథిలావస్థకు చేరిన సుమారు 10 వేలకు పైగా ఇళ్లను లబ్ధిదారులకు అందించేందుకు ప్రస్తుతం మౌలిక సదుపాయాల కల్పన పనులను అధికారులు జోరుగా సాగిస్తున్నారు.