జబల్పూర్ ట్రిపుల్ ఐటీలో విద్యార్థిని అనుమానాస్పద మృతితో చెలరేగిన కలకలం

రిపోర్టర్: T.RAJASHEKAR స్థలం: నర్సంపేట

మధ్య ప్రదేశ్లోని జబల్పూర్ ఐఐఐటీడీఎంలో మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్థిని వైష్ణవి హాస్టల్ గదిలో మృతి చెందిన ఘటనపై అడిషనల్ ఎస్పీ మనీష్ భరద్వాజ్ స్పందించారు. సంస్థ భద్రతా సిబ్బంది సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించారు. విద్యార్థిని గదిలో ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదని, మృతికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని, అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.