చండీగఢ్ లో రాకేష్ త్రెహాన్ ఆధ్వర్యంలో వినూత్నంగా ఐఫోన్ల పంపిణీ

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: Chandigarh

చండీగఢ్ లో రాకేష్ త్రెహాన్ అలియాస్ రాజా డి కింగ్ వినూత్నంగా ఐఫోన్ లంగర్ పేరిట ఉచితంగా ఐఫోన్ 17 హ్యాండ్‌సెట్లను పంపిణీ చేశారు. భద్రతా కారణాల దృష్ట్యా బహిరంగ ప్రదేశాల్లో కార్యక్రమానికి అనుమతి నిరాకరించడంతో సెక్టార్ 10లోని ఒక ప్రైవేట్ బంగ్లాలో ఈ పంపిణీ చేపట్టారు. వాట్సాప్ సందేశాల ద్వారా యాదృచ్ఛికంగా ఎంపిక చేసిన పది మందికి తొలి విడతలో ఐఫోన్లు అందజేశారు. రాబోయే రోజుల్లో దాదాపు రెండు వేల ఐఫోన్లను పంపిణీ చేయనున్నట్లు ఆయన ప్రకటించారు.