దేశంలో తొలి బుల్లెట్ రైలు తయారీ: కీలక భద్రతా పరీక్ష పూర్తి చేసిన అధికారులు

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: Bengaluru

భారత దేశపు మొట్టమొదటి స్వదేశీ హైస్పీడ్ బుల్లెట్ రైలు బి టెవెంటీ ఎయిట్ కీలక భద్రతా పరీక్షను విజయవంతంగా పూర్తి చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. బెంగళూరులోని బీఈఎంఎల్ తయారీ కేంద్రంలో ఈ వాహన బాడీ షెల్ స్క్వీజ్ టెస్ట్ నిర్వహించినట్లు వారు తెలిపారు. అహ్మదాబాద్ ముంబై హైస్పీడ్ రైలు కారిడార్ లో సూరత్ వాపి మధ్య రెండు వేల ఇరవై ఏడు మే లేదా జూన్ నాటికి ట్రయల్ రన్స్ ప్రారంభించాలని భారతీయ రైల్వే శాఖ ప్రణాళికలు రచిస్తోంది.