దిల్లీలో కంటి పరీక్షల పేరుతో మహిళపై అఘాయిత్యం చేసిన వ్యక్తి అరెస్టు
రిపోర్టర్: భాస్కర్
స్థలం: దిల్లీ
దిల్లీలోని కేశవ్ పురమ్ ప్రాంతంలో కంటి పరీక్షల పేరుతో 43 ఏళ్ల మహిళను తన ఇంటికి తీసుకెళ్లి అపస్మారక స్థితిలోకి దించి లైంగిక దాడికి పాల్పడిన 32 ఏళ్ల వికాస్ అనే వ్యక్తిని శనివారం పోలీసులు అరెస్టు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.