వింటేజ్ ఫొటోల ట్రెండ్‌తో సైబర్ నేరగాళ్ల కొత్త మోసాలు!
రిపోర్టర్: సురేష్
స్థలం: India
సోషల్ మీడియాలో ప్రస్తుతం 1980ల వింటేజ్ ఫొటో ఎడిటింగ్ ట్రెండ్ విపరీతంగా వైరల్ అవుతోంది. దీనిని ఆసరాగా చేసుకుంటున్న సైబర్ నేరగాళ్లు నకిలీ ఏపీకే లింకులు, మాల్వేర్ యాప్‌లతో ప్రజలను మోసగిస్తున్నారు. ఉచితంగా ఫొటోలు ఇస్తామంటూ నమ్మించి ఫోన్లలోకి చొరబడి వ్యక్తిగత సమాచారాన్ని తస్కరిస్తున్నారు. అపరిచిత లింకుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.