పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా రెండు దశాబ్దాలుగా మట్టి వినాయక పూజ
రిపోర్టర్: అశోక్
స్థలం: వరంగల్
వరంగల్ జిల్లా నర్సంపేట మండలం దాసరిపల్లికి చెందిన ఫ్రెండ్స్ యూత్ బృందం పర్యావరణ పరిరక్షణ కోసం గత 25 ఏళ్లుగా మట్టి వినాయకుడినే ప్రతిష్టిస్తూ ఆదర్శంగా నిలుస్తోంది. రజతోత్సవాలు జరుపుకుంటున్న ఈ బృందం, కుమ్మరి కళాకారుల వద్ద మట్టి ప్రతిమలను కొనుగోలు చేస్తూ వారికి ఉపాధి కల్పిస్తోంది. పీవోపీ విగ్రహాలకు దూరంగా వీరు సాగిస్తున్న ఈ ఉద్యమం అందరి ప్రశంసలు అందుకుంటోంది.