'సెన్సార్ బోర్డులో సుప్రియా యార్లగడ్డకు చోటు': పునర్వ్యవస్థీకరించిన కేంద్రం

రిపోర్టర్: మహేష్ స్థలం: న్యూఢిల్లీ

కేంద్ర సమాచార ప్రసారాల మంత్రిత్వ శాఖ సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్‌ను 18 మంది సభ్యులతో పునర్వ్యవస్థీకరించింది. శశి శేఖర్ వేంపటి సారథ్యంలోని ఈ కొత్త ప్యానెల్‌లో టాలీవుడ్ నుంచి అక్కినేని నాగార్జున మేనకోడలు, అన్నపూర్ణ స్టూడియోస్ నిర్వాహకురాలు సుప్రియా యార్లగడ్డకు సముచిత స్థానం లభించింది. ఈ కమిటీలో ప్రీతి జింటా, పంకజ్ త్రిపాఠి, సునీల్ శెట్టి, ప్రియదర్శన్ వంటి ప్రముఖులకు కూడా చోటు దక్కగా, సభ్యుల పదవీకాలం మూడేళ్లు ఉండనుంది.