హైదరాబాద్లో డాక్టర్ మన్మోహన్ సింగ్ మెమోరియల్ పార్క్ ప్రారంభం
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: Hyderabad
హైదరాబాద్లోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ విప్రో జంక్షన్ వద్ద డాక్టర్ మన్మోహన్ సింగ్ మెమోరియల్ పార్క్ ప్రారంభోత్సవం మరియు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా పాల్గొని ప్రారంభించారు. దేశ ఆర్థిక రంగానికి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అందించిన అమూల్యమైన సేవలను ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న వివిధ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలలో భాగంగా ఈ స్మారక పార్కును ప్రజలకు అంకితం చేసినట్లు తెలంగాణ సీఎంవో అధికారికంగా వెల్లడించింది.