ఇంద్రకీలాద్రిపై వైభవంగా కనకదుర్గమ్మ దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు

రిపోర్టర్: రాజేష్ స్థలం: ఎన్టీఆర్

విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గాదేవి దసరా శరన్నవరాత్రి ఉత్సవాల ముహూర్తం ఖరారైంది. అక్టోబరు 11 నుంచి 20 వరకు పదిరోజులపాటు ఈ ఆధ్యాత్మిక వేడుకలు వైభవంగా జరగనున్నాయి. అమ్మవారు పది విభిన్న అలంకారాల్లో భక్తులకు దర్శనమివ్వనున్నారు. చివరి రోజు అక్టోబరు 20న కృష్ణానదిలో హంసవాహన తెప్పోత్సవం అత్యంత ఘనంగా నిర్వహించనున్నట్లు పాలకమండలి ప్రకటించింది.