టీమ్ఇండియాకు భారీ షాక్.. అఫ్గాన్ సిరీస్‌కు స్టార్ స్పిన్నర్ దూరం

రిపోర్టర్: సురేష్ స్థలం: న్యూఢిల్లీ

భారత్, అఫ్గానిస్థాన్ మధ్య జరగనున్న రెండో టీ20 మ్యాచ్‌కు ముందు టీమ్ఇండియాకు భారీ షాక్ తగిలింది. తొలి మ్యాచ్‌లో అద్భుతంగా రాణించిన స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి పక్కటెముకల నొప్పితో గాయపడ్డాడు. దీంతో అతడు మిగిలిన రెండు టీ20 మ్యాచ్‌లకు దూరమయ్యాడు. గత కొంతకాలంగా వరుస గాయాలతో సతమతమవుతున్న వరుణ్ స్థానంలో బీసీసీఐ ఇంకా ఎవరినీ ఎంపిక చేయలేదు.