నా వ్యాఖ్యలను తప్పుగా తీసుకోవద్దంటూ నటుడు సంపూర్ణేష్ బాబు స్పష్టీకరణ
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: తెలంగాణ
జర్నలిస్ట్ నాగేంద్ర కుమార్ ఇంటర్వ్యూ వివాదంపై నటుడు సంపూర్ణేష్ బాబు స్పందించారు. నాగేంద్ర కుమార్ తనకు అత్యంత సన్నిహితుడని, సరదాగా చేసిన వ్యాఖ్యలను అభిమానులు తప్పుగా అర్థం చేసుకోవద్దని సంపూర్ణేష్ బాబు కోరారు. తనను కించపరచాలనే ఉద్దేశం ఆయనకు లేదని, సాన్నిహిత్యం కారణంగానే అలా మాట్లాడారని స్పష్టం చేశారు. మరోవైపు తన వ్యాఖ్యల పట్ల ఎవరికైనా మనస్తాపం కలిగి ఉంటే బేషరతుగా క్షమాపణలు చెబుతున్నట్లు జర్నలిస్ట్ నాగేంద్ర కుమార్ వెల్లడించారు.