'స్వచ్ఛంగా తొలగించకపోతే చర్యలు తప్పవు': భద్రాద్రి ఆలయ భూముల ఆక్రమణలపై అధికారులు

రిపోర్టర్: సునీల్ స్థలం: భద్రాద్రి కొత్తగూడెం

భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానానికి చెందిన ఆంధ్రప్రదేశ్‌లోని పురుషోత్తపట్నం భూములలో అక్రమ నిర్మాణాలపై అధికారులు కఠిన చర్యలకు సిద్ధమయ్యారు. దేవస్థానం భూముల్లోని అక్రమ కట్టడాలను స్వచ్ఛందంగా తొలగించాలని, లేనిపక్షంలో హైకోర్టు ఆదేశాల మేరకు అధికారులే కూల్చివేత చర్యలు చేపడతారని హెచ్చరించారు. గతంలో భూముల పరిశీలనకు వెళ్లిన ఈవోపై దాడి జరిగిన నేపథ్యంలో, దేవస్థానం ఆస్తుల పరిరక్షణపై యంత్రాంగం మరింత దృఢంగా వ్యవహరిస్తోంది.