తీవ్ర వాయుగుండం ప్రభావంతో విశాఖలో భారీ వర్షాల హెచ్చరిక
రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్
స్థలం: విశాఖపట్నం
వాయవ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం తీవ్ర వాయుగుండంగా బలపడింది. ఇవాళ రాత్రికి విశాఖ-గోపాల్పూర్ మధ్య ఇది తీరం దాటే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. దీని ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ఆయా జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. ఆకస్మిక వరదలు ముప్పున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తమై కంట్రోల్ రూములు, పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు.