తిరుమల శ్రీవారి ఆర్జిత సేవల కోటా విడుదల తేది వెల్లడి
రిపోర్టర్: కిరణ్
స్థలం: తిరుమల
తిరుమల శ్రీవారి భక్తుల సౌకర్యార్థం డిసెంబర్ మాసానికి సంబంధించిన ఆర్జిత సేవల కోటాను ఈ నెల 19న ఉదయం 10 గంటలకు తితిదే ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్ కోసం 21వ తేదీ ఉదయం 10 గంటల వరకు నమోదు చేసుకోవచ్చు. ఎంపికైన భక్తులు 23 మధ్యాహ్నం 12 గంటలలోపు సొమ్ము చెల్లించి లక్కీడిప్ టికెట్లు పొందాలని తితిదే సూచించింది.