విజయవాడలో భారీ వర్షాలు, పవన్ కళ్యాణ్ అత్యవసర సమీక్ష
రిపోర్టర్: అశోక్
స్థలం: ఎన్టీఆర్ జిల్లా
విజయవాడలో భారీ వర్షాలకు ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. అల్లూరి సీతారామరాజు జిల్లాలో వర్షాల తీవ్రతపై ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులతో అత్యవసర సమీక్ష నిర్వహించారు. ప్రమాదకర ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. అల్పపీడన ప్రభావంతో మరో 24 గంటలు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.