పలాసలో అభివృద్ధి పరుగులు: 26వ వార్డులో సీసీ రోడ్డుకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే గౌతు శిరీష
రిపోర్టర్: Dinesh panda
స్థలం: పలాస
పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని 26వ వార్డులో పదిహేనవ ఆర్థిక సంఘం నిధులు ఎనిమిది లక్షల రూపాయలతో నిర్మించనున్న నూతన సీసీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే గౌతు శిరీష శంకుస్థాపన చేశారు. ఈ రహదారి నిర్మాణం పూర్తయితే స్థానిక నివాసితులకు, విద్యార్థులకు రాకపోకలు మరింత సులభతరం కానున్నాయి. పట్టణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు తమ ప్రభుత్వం ఎప్పుడూ పెద్దపీట వేస్తుందని ఈ సందర్భంగా ఆమె స్పష్టం చేశారు.