ఆదిలాబాద్ రిమ్స్ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి తీరును తప్పుబట్టిన కవిత
రిపోర్టర్: కిరణ్
స్థలం: ఆదిలాబాద్
ఆదిలాబాద్ రిమ్స్‌లో విద్యుత్ షార్ట్‌సర్క్యూట్, ఏసీ పేలి ఐదుగురు చిన్నారులు మృతి చెందడానికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత తీవ్రంగా విమర్శించారు. సురక్ష చిల్డ్రన్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బాధితుల తల్లిదండ్రులను పరామర్శించిన అనంతరం ఆమె మాట్లాడుతూ.. జిల్లాను దత్తత తీసుకున్న సీఎంకు ఐదు మంది పసిపిల్లలు చనిపోతే వచ్చి చూసే సమయం లేదా అని నిలదీశారు. పెండింగ్ హెల్త్ బిల్స్ విడుదల చేయాలని, లేదంటే నెల రోజుల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను ఘెరావ్ చేస్తామని హెచ్చరించారు.