ఎచ్చెర్లలో కౌంటింగ్ వేళ ట్రాఫిక్ ఆంక్షలతో రెడ్ జోన్ విధించిన పోలీసులు
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: శ్రీకాకుళం
శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలోని శ్రీ శివాని ఇంజినీరింగ్ కళాశాలలో జరుగుతున్న ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా శనివారం ప్రత్యేక ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నట్లు డీఎస్పీ ధనుంజయ నాయుడు తెలిపారు. కౌంటింగ్ కేంద్రం చుట్టూ రెండు కిలోమీటర్ల పరిధిని రెడ్‌జోన్‌గా ప్రకటించామని ఆయన స్పష్టం చేశారు. ప్రయాణికులు పోలీసుల సూచనల మేరకు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని పేర్కొన్నారు.